నేను ఎందుకు బ్లాగర్ ని అయ్యానంటే----
నా గురించి నేను ---
నా పేరు గంగ భవాని భి.ఎస్సి చదివాను.
చిరుజల్లులా...జదివానలా...పాపికొండల నడుమ గోదారిలా... ఉండటం ఇష్టం . ఉండే వాళ్ళంటే నాకిష్టం .
నా భావాలను పంచుకోవడానికి ... మనసులో మెదిలే ప్రతి మంచి ఆలోచనను చదువరుల హృదయాలకు ట్రాన్స్ఫర్ చెయ్యడానికి... అన్నింటికంటే ముఖ్యంగా చదివే మీ అందరితో మాటల యుద్ధం చెయ్యటానికి ...
నా బాల్యం గుర్తుకు వస్తే ముందుగా అమ్మమ్మ కనిపిస్తుంది.
అమ్మమ్మ లేని బాల్యాన్ని ఊహించలేను.
గోరుముద్దలు చిట్టి కథలు లాలనలు మందలింపులు అన్ని అమ్మమ్మ చలవే.
ఇప్పుదు అమ్మమ్మ లేదు. కానీ
మండు వేసవిన శీతలపవనంలా... మల్లెపూలవానలా... ఎప్పుదూ కళ్ళముందు అమ్మమ్మ కదలాడుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి